: కాంగ్రెస్ నాటక సభ: కేటీఆర్
తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేడు హైదరాబాద్ లోని నిజాం కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న తెలంగాణ సాధన సభ నాటక సభగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె తారకరామారావు విమర్శించారు. తెలంగాణ సాధన సభ కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా కాంగ్రెస్ అధిష్ఠానానిదేనన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నిజంగా చిత్త శుద్ధి ఉంటే సోనియాగాంధీ ఇంటి ముందు ధర్నా చేయాలని పిలుపునిచ్చారు.