: ఇప్పుడు పదికి పది: విద్యాబాలన్


వరుస హిట్లతో బాలీవుడ్ లో సెటిలైన విద్యాబాలన్ ప్రస్తుతం నిండైన ఆత్మవిశ్వాసంతో ఉన్నానని చెబుతోంది. విద్య ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. "నేను 25ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నా తొలి చిత్రం పరిణీత విడుదల సమయంలో 10/10 పాయింట్ల ఆత్మవిశ్వాసంతో ఉన్నా. తర్వాత నా ఆత్మవిశ్వాసం 3 పాయింట్లకు పడిపోయింది. మళ్లీ ఇప్పుడు 34 ఏళ్ల వయసులో 10/10 ఆత్మవిశ్వాసంతో ఉన్నాను" అని చెప్పింది. 16 ఏళ్ల వయసులో ఆనందానికి దూరంగా ఉన్నానని, అప్పటి కంటే ఇప్పుడే ఎంతో ఆనందాన్ని పొందుతున్నానని చెప్పింది.

  • Loading...

More Telugu News