: శ్రీవారి దర్శనానికి 27 గంటలు


ఆదివారం సెలవుదినం కావడంతో తిరుమల వెంకన్నను దర్శించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లన్నీ నిండిపోయాయి. దీంతో, తిరుమల వీధుల్లో కిలోమీటర్ల పొడవున భక్తులు బారులు తీరి ఉన్నారు. ఇక శ్రీవారి దర్శనానికి 27 గంటలు పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి 8 గంటలు పడుతోంది. కాలినడకన వచ్చే భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవాలంటే 14 గంటలు పడుతోంది.

  • Loading...

More Telugu News