: ఎర్రరక్త కణాల ప్రవాహాన్ని అంచనా వేయొచ్చు
ఎర్ర రక్తకణాలు మన శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను చేరవేయాల్సి ఉంటుంది. అయితే వీటి గమనాన్ని గురించి ఇంతవరకూ పూర్తి కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోయారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎర్రరక్త కణాలు మన శరీరంలో ప్రయాణించే తీరును గురించి కచ్చితంగా అంచనా వేయగలిగారు. వీటి గమనాన్ని వివరించే కంప్యూటర్ సిమ్యులేషన్ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
మన శరీరం మొత్తానికి ఆక్సిజన్‌ను చేరవేయాల్సిన బాధ్యత ఎర్రరక్త కణాలపై ఉంది. అయితే శరీరంలోని దెబ్బతిన్న ఎర్రరక్త కణాలు పరస్పరం పొరుగుననున్న ఎర్రరక్త కణాలతో ఎలా వ్యవహరిస్తాయో ఈ కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. దీని ద్వారా రక్త ప్రసరణకు సంబంధించి తీవ్ర సమస్యలు ఉన్న వారికి మరింత మెరుగైన చికిత్సను అందించేందుకు వైద్యులకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. అలాగే మధుమేహం, రక్తప్రసరణ వంటి సమస్యల కోసం స్టెంట్లు, కృత్రిమ గుండె వంటివాటిని అమర్చుకున్న రోగుల్లో రక్త ప్రవాహాన్ని అంచనా వేయడానికి కూడా ఈ కంప్యూటర్ సిమ్యులేషన్ బాగా ఉపయోగపడుతుంది.