: పోలీసులను బెంబేలెత్తించిన కారు


హైదరాబాదు శివారు శంషాబాద్ పరిధిలోని పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు సర్కిల్ దగ్గర ఓ గుర్తుతెలియని కారు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్, కేంద్రమంత్రి కృపారాణి అదే దారిలో వస్తున్న నేపథ్యంలో ఏపీ 23 0024 నెంబరుగల ఓ కారు మాత్రం చాలా సేపటి నుంచి అక్కడే ఉంది. ఎంతసేపైనా ఆ కారు సొంతదారులు వచ్చి ఆ కారును తీయకపోవడంతో అనుమానమొచ్చిన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ను తెప్పించి క్షుణ్ణంగా తనిఖీలు చేయించి, ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News