: సోనాక్షీసిన్హాకి కోపమొచ్చింది


బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్ హీరోయిన్ సోనాక్షీ సిన్హాకి కోపమొచ్చింది. సల్మాన్, అక్షయ్, అజయ్ వంటి పెద్దహీరోలతో జోడీకట్టి వందకోట్ల హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న సోనాక్షీ సిన్హా తన కొత్త సినిమాల్లో యువతరానికి వేడిపుట్టించేంత రోమాంటిక్ గా నటిస్తోందంటూ వస్తున్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బాలీవుడ్ లో షికారు చేస్తున్న వార్తలపై సోనాక్షి స్పందిస్తూ, తాను చేస్తున్న సినిమా నిర్మాతలు, దర్శకులు, ప్రెస్ రిలేషన్స్ మేనేజర్లను పిలిచి చీప్ ట్రిక్స్ కి పాల్పడొద్దని, తమ సినిమాలను హుందాగా ప్రచారం చేసుకోవాలని క్లాసు పీకిందని సమాచారం. తనను సంప్రదించిని మీడియా ప్రతినిధులకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటోంది.

  • Loading...

More Telugu News