: పార్టీ పెడతాం.. ఎన్నికల్లో పోటీ చేస్తాం: తెలంగాణ విద్యార్థులు


ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆది నుంచి క్రియాశీలకపాత్ర పోషిస్తున్నది విద్యార్థులే. ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రస్థానంగా వారు సాగిస్తున్న పోరు ప్రస్థానం ఇక రాజకీయ పంథావైపు మళ్ళనుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని వారు భావిస్తుండడమే అందుకు కారణం. ఈ క్రమంలో ఓ పొలిటికల్ పార్టీని స్థాపిస్తామని తెలంగాణ విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. ఆ దిశగా తొలి అడుగును సైతం వేశాయి. ఓయూ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఓయూజేఏసీ), తెలంగాణ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్ జేఏసీ) ప్రతినిధులు హైదరాబాద్ లో భేటీ అయ్యారు.

రెండు సంఘాలను విలీనం చేసి కొద్దినెలల్లో పార్టీ పెట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. పార్టీ పేరును తెలంగాణ విద్యార్థి పార్టీగా తీర్మానించారు. సెప్టెంబర్ 17న ఉస్మానియా వర్శిటీలో భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ పెడుతున్నట్టు ప్రకటిస్తామని ఓయూజేఏసీ ప్రతినిధి కృశాంక్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News