: ఐటీకి అనుగుణంగా పోస్టల్ సేవలు
ఐటీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పోస్టల్ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి పురంధేశ్వరి వివరించారు. దేశవ్యాప్తంగా పోస్టల్ సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పురంధేశ్వరి శనివారం విశాఖపట్నంలో వెల్లడించారు. విశాఖ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో నూతన పోస్టాఫీస్ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు.