: పెరిగిన పెట్రోలు ధరలు


రూపాయి పతనం ఎఫెక్ట్ ప్రజలకు నేరుగా తగిలింది. ఇంత వరకూ స్టాక్ మార్కెట్ కుదేలైపోవడం, బంగారం కొనొద్దు వంటి ప్రకటనలతో రూపాయి పతనాన్ని ప్రజలకు తెలిపిన ప్రభుత్వం, తాజాగా పెట్రోలు ధరలు పెంచింది. రూపాయి రోజురోజుకీ క్షీణించి 60 రూపాయల మార్కు చేరుకోవడంతో అంతర్జాతీయంగా డాలర్ విలువ బలపడింది. దీంతో పెట్రోలు లీటరుకు 1.82 రూపాయలు పెరిగింది. దీంతో ఇతర టాక్సులన్నీ కలుపుకుని 2.32 రూపాయలు పెరగనుంది. పెరిగిన ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తున్నాయి. అంతర్జాతీయంగా పెట్రోలు డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నప్పటికీ రూపాయి పతనం, డాలర్ బలపడడం కారణంగా ఇంధన ధరలు పెంచాల్సి వచ్చిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News