: నేపాల్ లో స్వల్ప భూకంపం
పశ్చిమ నేపాల్ లో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5 గా నమోదైంది. నేపాల్ నైరుతి దిశలోని రుకుం జిల్లాలో భూకంపకేంద్రం ఉందని అధికారులు తెలిపారు. భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురై ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. ఇంకా నష్టం వివరాలు తెలియలేదు.