: ధోనీ మైదానంలో సక్సెస్ ... క్లాసులో ఫెయిల్!
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో చిచ్చర పిడుగే కావచ్చు. బోలెడు విజయాలు మూటగట్టుకోవచ్చు... కానీ, తరగతి గదిలో మాత్రం ఫెయిలయ్యాడు. అవును... ధోనీ డిగ్రీ పరీక్షల్లో విజయం సాధించలేకపోయాడు.
మన కెప్టెన్ రాంచీలోని సెయింట్ జేవియర్స్ కళాశాల విద్యార్ధి. 2008 లో ఈ కాలేజీలో చేరిన ధోనీ, ఇంటా బయటా క్రికెట్ ఆటలతో తీరిక లేని కారణంగా, ఆరు సెమిస్టర్ తరగతులకూ హాజరు కాలేకపోయాడు. ఒక్క పరీక్ష కూడా రాయలేదు. దాంతో, మనవాడికి డిగ్రీ పట్టా ఇంకా అందని ద్రాక్షలా ఊరిస్తూనే వుంది!