: సర్కారీ బడులకు చెలగాటం... విద్యార్ధుల ప్రాణసంకటం
సర్కారీ బడులలో అప్పుడే సమస్యలు మొదలయ్యాయి. ఒకచోట సర్కారీ భోజనం విద్యార్ధుల పీకలమీదికి తెస్తే, మరో చోట పాఠశాల పైకప్పే ప్రాణాంతకంగా మారింది. స్కూళ్లు ప్రారంభమై పట్టు మని పదిరోజులు కూడా కాలేదు. అప్పడే విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పుస్తకాలు, దుస్తుల ఇబ్బందులు ఎలాగూ ఉండేవే. అయితే కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకల్లులో మద్యాహ్నభోజనం వికటించి 16 మంది విద్యార్ధుల ప్రాణాల మీదికి తెచ్చింది. వీరంతా పాణ్యంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో వైపు, పాఠశాల పైకప్పు పెచ్చులూడి 16 మందిని గాయపరిచింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం బోరండపల్లి ప్రాధమికోన్నత పాఠశాల భవనం పైకప్పు కూలిపోయేలా ఉంది. ఈ పైకప్పు పెచ్చులూడడంతో విద్యార్థులు గాయాలపాలయ్యారు. వీరు స్థానిక ఆసుపత్రిలో చిక్సిత్స పొందుతున్నారు.