: అప్పుడే మాతృ భాషను గౌరవించినట్టవుతుంది: కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి
ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యమిచ్చినప్పుడే మాతృభాషను గౌరవించినట్టవుతుందని కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. మాతృ భాషా దినోత్సవం సందర్భంగా కర్నూలులోని పాతనగరంలో తెలుగుతల్లి విగ్రహానికి ఆయన పూలమాల వేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఆంగ్లం, హిందీ భాషలతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా బోర్డులు ఏర్పాటు చేస్తారన్నారు. అదే మన రాష్ట్రంలో మాత్రం వ్యాపార, వాణిజ్య సముదాయాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఆంగ్లభాషలో మాత్రమే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.