: స్థానిక ఎన్నికల ఖర్చు 160 కోట్లు


స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం 160 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌ రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. శాంతిభద్రతల అంశంపై పోలీసు అధికారులతో చర్చించామని చెప్పారు. 64 వేల మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉంటారని చెప్పారు. ప్రభుత్వం నుంచి వివరాలు అందిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వం ఇప్పటికే 104 కోట్ల రూపాయలను విడుదల చేసిందన్నారు. రేపు ఉదయం 11 గంటలకు రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News