: ఒక్క రక్తపు చుక్క చాలు...


ఒక్క రక్తపు చుక్క చాలు... ఇప్పుడు పలు వైద్య పరిశోధనలకు కేవలం ఒక్క రక్తపు చుక్కనే తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఒక్క రక్తపు చుక్కతోనే క్లోనింగ్‌ ప్రక్రియ ద్వారా జీవులను ఉత్పత్తి చేసేస్తున్నారు శాస్త్రవేత్తలు.

జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు కేవలం ఒక రక్తపు చుక్కతో ఒక ఎలుకను క్లోనింగ్‌ ద్వారా సృష్టించారు. ఎలుక తోకనుండి సేకరించిన రక్తపు చుక్కలోని కణాలతో మరో ఆడ ఎలుకను సృష్టించారు. క్లోనింగ్‌ ద్వారా పుట్టిన ఈ ఆడ ఎలుకలో సహజ పునరుత్పత్తి వ్యవస్థ కూడా పూర్తిగా అభివృద్ధి చెందివుందని, సక్రమంగానే పనిచేస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కొత్త రకం క్లోనింగ్‌ ప్రక్రియతో క్లోనింగ్‌ విభాగంలో సంభవించే విజయావకాశం మూడు నుండి పదిశాతానికి పెరిగిందని టోక్యోలోని రికెన్‌ సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంటల్‌ బయాలజీకి చెందిన నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News