: ఆ గౌను ధర కోటి!
ఒక గౌను ధర కోటి రూపాయలు... అయితే అది సాదాసీదా గౌను కాదు. ప్రముఖ హాలీవుడ్ నటి ఎలిజబెత్ టేలర్ ధరించింది. మరణించినా ఎలిజబెత్ టేలర్‌కు ఇప్పటికీ క్రేజ్ తగ్గడం లేదు. ఎంతలా అంటే ఆమె వేసుకున్న గౌను అక్షరాలా కోటి రూపాయలు పలికిందిట. హాలీవుడ్ నటి ఎలిజబెత్ తన వివాహ సమయంలో ధరించిన ఈ గౌను లేత గోధుమ రంగుతో ముత్యాలు పొదిగి ఎంతో ఆకర్షణీయంగా ఉందట. ఇలాంటి అందమైన గౌనును గురువారం నాడు క్రిస్టీ సంస్థ వేలానికి పెట్టింది.
2011లో 79 ఏళ్ల వయసులో మరణించిన ఎలిజబెత్ గౌను ఈ వేలం పాటలో 187931 డాలర్లు పలికిందట. అంటే మన డబ్బులో రూ.1.12 కోట్లు. ఈ విషయం గురించి వేలం వేసిన సంస్థ క్రిస్టీ డైరెక్టర్ మాట్లాడుతూ, తాము ఈ గౌను ధర విషయంలో ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తానికే అమ్ముడు పోయిందని తెలిపారు. ఈ వేలంతో హాలీవుడ్లో, ఫ్యాషన్ ప్రపంచంలో గౌను ప్రాముఖ్యత ప్రతిబింబించిందని తెలిపారు.