: తలైజా జైలులో గ్యాంగ్ స్టర్ అబూ సలీంపై దాడి


ముంబైలోని తలైజా జైలులో మాఫియా గ్యాంగ్ స్టర్ అబూసలేంపై దాడి జరిగింది. ముంబై పేలుళ్లతో పాటు పలు నేరాలపై అరెస్టయిన అబూ సలేం, దావూద్ ఇబ్రహీం గ్యాంగు నుంచి వేరుకుంపటి పెట్టుకుని దావుద్ తో కయ్యం పెట్టుకున్నాడు. దాంతో అబూ సలేంపై రెండు సార్లు దాడులు జరిగాయి. అయినా అబూ సలేం బ్రతికి బట్టకట్టాడు. కాగా, అబూ సలేం తలైజా జైలులో ముంబై పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ దాడికి నిందితుడు తుపాకీ ఉపయోగించాడని విశ్వసనీయ సమాచారం. జైలులో తుపాకీతో పోలీసులే దాడికి పాల్పడ్డారా? లేక దావూద్ గ్యాంగ్ కు సంబంధించిన వ్యక్తా? అనేది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News