: బాధితులతో కలిసి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు
వరద బాధితులతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేరుకున్నారు. ఉత్తరాఖండ్ లో చార్ ధామ్ యాత్రీకులు వరదల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవడంలో గత ఐదు రోజులుగా చంద్రబాబు నాయుడు తలమునకలయ్యారు. చంద్రబాబు నాయుడు డెహ్రాడూన్ వెళ్లిన తరువాత తెలుగువారికి సహాయక చర్యలు ఊపందుకున్నాయని, టీడీపీ చొరవ తీసుకుని యాత్రీకుల కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడంతో సురక్షితంగా ఇళ్లకు చేరుకుంటున్నామని యాత్రీకులు హర్షం వ్యక్తం చేశారు.
బాధితులతో పాటు ఒకే విమానంలో హైదరాబాద్ చేరుకున్న బాబు, యాత్రీకులు క్షేమంగా ఇళ్లకు చేరడం ఆనందంగా ఉందని, రేపు సాయంత్రం మరో విమానం డెహ్రాడూన్ నుంచి హైదరాబాద్ కు వస్తుందని, అప్పటితో యాత్రీకులంతా స్వస్థలాలకు చేరుకున్నట్టవుతుందని తెలిపారు.