: లోక్ పాల్ బిల్లుకు లోక్ సత్తా సూచనలు
లోక్ పాల్ బిల్లు....అవినీతికి గొడ్డలి పెట్టుగా, దేశంలోని నేతలతో సహ అందరినీ సమాన స్థాయిలో చట్టం ముందు నిలబెట్టే అస్త్రంగా సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే రూపొందించిన బిల్లు. ఇపుడు ఈ లోక్ పాల్ బిల్లుకు లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ పలు సూచనలు చేశారు.
లోక్ పాల్ బిల్లు అమలుతో ప్రభుత్వ రంగాల్లో అవినీతి నిర్మూలన, జవాబుదారీతనం పెంచవచ్చని ఆయన అన్నారు. అలాగే సర్వీసెస్ గ్యారెంటెడ్ బిల్లు ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు, రాజ్యాంగబద్ధ సంస్దల్లో కచ్చితమైన పనివిధానం అమలవుతుందని జెపి అన్నారు. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ రెండు బిల్లులను ఆమోదించాలని ఆయన అన్ని రాజకీయ పార్టీలను కోరారు.