: హనుమంతు కిష్కింద కాండ చేశాడు: రేవంత్ రెడ్డి
టీడీపీ నేతలతో గొడవపడిన హనుమంతు డెహ్రాడూన్ ను కిష్కిందకాండ చేశాడని టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పై మండిపడ్డారు. హైదరాబాద్ లోని టీడీపీ భవన్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. బుద్ధి ఉన్న వాడెవ్వడూ చేయని పనిని కాంగ్రెస్ నేతలు చేశారని, బాధితులను స్వస్థలాలకు చేర్చేందుకు చొరవ తీసుకోవాల్సింది పోయి, వివాదం చేసేందుకు చొరవ తీసుకున్నారని ఆరోపించారు. తెలుగువారు అన్యాయానికి గురౌతుంటే అధికారంలో ఉండి దాన్ని అడ్డుకోవడం మానేసి, క్రెడిట్ కోసం గొడవపడ్డారన్న రేవంత్ రెడ్డి, ఈ ఘటనతో కాంగ్రెస్ నేతలంతా బఫూన్లుగా మారారని విమర్శించారు.