: మరోసారి రెచ్చిపోయిన సీపీఐ నారాయణ
ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల అధిపతులను బట్టలూడదీసి ఊరేగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ వ్యాఖ్యానించారు. విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్న నాయకులను వందసార్లు ఉరేసినా పాపంలేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మెదడు అరికాలులో పెట్టుకుందని ఎద్దేవా చేశారు.