: కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ఇస్తుంది: జానా


మంత్రి జానారెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానంపై ఎనలేని విశ్వాసాన్ని ప్రకటించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో జానారెడ్డి మాట్లాడుతూ అధిష్ఠానం తెలంగాణ ఇస్తుందని నమ్మకంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రసాధనకు గతంలో పదవులకు రాజీనామాలు చేశామని, అవసరమైతే మరోసారి కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సైతం తామంతా సిద్దమని ఆయన తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ తోనే సాధ్యమనే నమ్మకాన్ని ప్రజల్లో కల్గించడంతో పాటు, ప్రజా ఆకాంక్షను చాటడమే నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభ ఉద్దేశమని జానారెడ్డి స్పష్టం చేశారు. రాయల తెలంగాణపై ఇప్పటివరకూ ఎలాంటి చర్చ జరగలేదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News