: భర్త మరణం తట్టుకోలేక.. నిప్పంటించుకున్న జవాను భార్య


విధి నిర్వహణలో ఓ జవాను ప్రాణాలు కోల్పోగా.. అతడి మరణాన్ని తట్టుకోలేక భార్య తానూ ప్రాణత్యాగం చేసిన ఘటన అందరినీ కలచివేసింది. సోమవారం కాశ్మీర్లో ప్రధాని పర్యటనకు ముందు జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఆదిత్య నంది అనే భారత సైనికుడు నేలకొరిగాడు. అతడి స్వస్థలం పశ్చిమ బెంగాల్ బంకురా జిల్లాలోని తాల్దంగ్రా గ్రామం. భర్త మిలిటెంట్ల తూటాలకు ప్రాణాలొదిలాడన్న వార్త జీర్ణించుకోలేని ఆ యువతి వెంటనే ఒంటికి నిప్పంటించుకుంది. అది గమనించిన ఇరుగుపొరుగు ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఈరోజు మరణించింది.

వారిద్దరికీ ఏడాది క్రితమే వివాహమైందని, నెలరోజుల సెలవుపై ఇంటికొచ్చిన ఆదిత్య శనివారమే విధుల్లో చేరాడని బంకురా ఎస్సీ ముఖేశ్ కుమార్ తెలిపారు. కాగా, ఆదిత్య మృతదేహాన్ని రేపు ఉదయం కోల్ కతా తీసుకురానున్నారు. అక్కడినుంచి స్వగ్రామం తరలిస్తారు. గురువారం నాడు భార్యాభర్తలకు ఒకేసారి అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News