: అతి చేసిన టీవీ జర్నలిస్టుపై వేటు
అత్యుత్సాహం ఆ టీవీ జర్నలిస్టు కొంపముంచింది. ఉత్తరాఖండ్ వరదలపై తాజా సమాచారం సరికొత్త రీతిలో ప్రెజెంట్ చేయాలన్న అతని ప్రయత్నం బెడిసికొట్టింది. నడుంలోతు నీళ్ళలో ఓ బాధితుడు నదిలో నిలుచుండగా అతని భుజాలపైకెక్కి రిపోర్టింగ్ చేసిన హిందీ చానల్ న్యూస్ ఎక్స్ ప్రెస్ జర్నలిస్టు నారాయణ్ పర్జైన్ ఉద్యోగం ఊడింది. డెహ్రాడూన్ రిపోర్టర్ అయిన నారాయణ్ విచిత్ర రిపోర్టింగ్ విన్యాసం తాలూకు వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేయగా.. అతగాడి తీరుపై దుమారం రేగింది. ఇలాంటి రిపోర్టర్ తమకొద్దంటూ సదరు చానల్ తన వెబ్ సైట్లో పేర్కొంది.
కాగా, ఈ విషయమై నారాయణ స్పందిస్తూ.. నమ్మిన మిత్రుడే వెన్నుపోటు పొడిచాడని.. తనకు తెలియకుండా ఆ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి తన ఉద్యోగానికి ఎసరు పెట్టాడని వాపోయాడు. అక్కడి గ్రామ ప్రజలు తాను ఒంటరిగా నది దాటుతుండగా వారించారని, వారే ఓ వ్యక్తి భుజాలపైకెక్కాలని సూచించారని వివరించాడు.