: కుక్.. సచిన్ రికార్డులను బ్రేక్ చేస్తాడట!


భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డులను ఇంగ్లండ్ సారథి అలిస్టర్ కుక్ తిరగరాస్తాడని స్టార్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ అంటున్నాడు. టెస్టుల్లో ఇప్పటికే 8,000 పరుగులు పూర్తిచేసుకున్న కుక్.. సచిన్ పేరిట నమోదైన ప్రతి రికార్డును తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని కేపీ వ్యాఖ్యానించాడు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ స్టార్ బ్యాట్స్ మన్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. అవేంటో కేపీ మాటల్లోనే..

'కుక్..ఇంగ్లండ్ జట్టుకు సారథ్యానికి అన్ని విధాలా అర్హుడు. జట్టును నడిపించే విషయంలోనే కాకుండా, బ్యాట్స్ మన్ గానూ దూసుకెళుతున్నాడు. బ్యాటింగ్ రికార్డులు ఎవరు నెలకొల్పనీ.. అన్నింటినీ బద్ధలు కొడతాడు. ముఖ్యంగా బ్యాటింగ్ లెజెండ్ సచిన్ సాధించిన రికార్డులను తుత్తునియలు చేస్తాడు. కుక్ ఇప్పుడదే పనిలో ఉన్నాడు. 40 ఏళ్ళ సచిన్ టెస్టుల్లో 15,837 పరుగులు చేస్తే.. కుక్ 27 ఏళ్ళకే 8,313 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు' అని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News