: సాహసాలే నిలబెట్టాయి: ఇమ్రాన్ హష్మి
సాహసాలతోనే విజయాలు సాధించానని బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి తెలిపాడు. ఇమ్రాన్ హష్మి, విద్యాబాలన్ జంటగా నటించిన 'ఘన్ చక్కర్' సినిమా త్వరలో విడుదల కానుంది. కహానీ తరువాత 15 నెలల విరామం తీసుకొని విద్యబాలన్ చేసిన సినిమా ఇది. 'వృత్తిలో నేను తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. అప్పటివరకు బాలీవుడ్లో ఏ నటుడూ తీసుకోలేని నిర్ణయాలను నేను తీసుకున్నాను. ఓ స్థాయికి వచ్చాను కదా అని రిస్క్ చేయడం మానేయను. వాటిని కంటిన్యూ చేస్తా' అంటూ తెలిపాడు.