: మనీషా కొత్త లుక్


ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత నటి మనీషా కోయిరాలా దేశంలో అడుగుపెట్టింది. బుధవారం రాత్రి ముంబైలోని ఆంధేరిలో తన స్వగృహానికి చేరుకుంది. ఒవేరియన్ కేన్సర్ ఉన్నట్లు బయటపడడంతో ఆరు నెలల క్రితం చికిత్స కోసం మనీషా న్యూయార్క్ వెళ్లింది. చికిత్స అనంతరం అక్కడే ఉండిపోయింది. మనీషా ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఆమె మేనేజర్ సుబ్రతో ఘోష్ తెలిపారు. విశేషమేమిటంటే, మళ్లీ మనీషాలో కొత్త అందం తొణికిసలాడుతోంది. పెళ్లి తర్వాత మనీషా రూపులేకుండా మారిపోయిన సంగతి తెలిసిందే. కేన్సర్ చికిత్స వల్లో, ఆరోగ్య సూత్రాలు పాటించిందో కానీ, మనీషా మళ్లీ అందంగా మారిపోయింది.

  • Loading...

More Telugu News