: బాధితుల వద్దకు వైద్యులను తీసుకెళ్ళిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకోవడంలో చొరవ ప్రదర్శిస్తున్నారు. వాతావరణం అనుకూలించకున్నా.. ఆయన ఈ ఉదయం హృషికేశ్ చేరుకున్నారు. బాధితులకు తక్షణ వైద్య సాయం అందించేందుకు బాబు తన వెంట కొందరు వైద్యులనూ తీసుకెళ్ళారు. అక్కడ బాధితులను పరామర్శించిన బాబు బదరీనాద్ వద్ద చిక్కుకుపోయిన వారిని రేపు సాయంత్రంలోగా స్వస్థలాలకు చేర్చేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.