: నటి జీవితకు కోర్టు సమన్లు
చెక్‌బౌన్స్ కేసులో నటి, దర్శకురాలు జీవితకు నాంపల్లి పదిహేడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. పరంధామరెడ్డి అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి నుంచి గత డిసెంబర్‌లో జీవిత రూ.35 లక్షలు అప్పుగా తీసుకుని చెల్లించడంలో విఫలమయ్యారు. ఆమె పూచీకత్తుగా ఇచ్చిన చెక్కులను పరంధామరెడ్డి బ్యాంకులో డిపాజిట్ చేయగా.. అవి బౌన్స్ అయ్యాయి. దీంతో పరంధామరెడ్డి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 20న హాజరై వివరణ ఇవ్వాలని సమన్లలో కోర్టు జీవితను ఆదేశించింది.