: బంగారంతో క్యాన్సర్‌ను గుర్తించొచ్చు
బంగారాన్ని కేవలం ఆభరణాలుగా ఉపయోగించడం మనం చూస్తుంటాం. అయితే ఇదే బంగారంతో క్యాన్సర్ వ్యాధిని కూడా గుర్తించవచ్చట. స్కాట్లాండ్కు చెందిన శాస్త్రవేత్తలు బంగారంతో తయారు చేసిన చిన్న గొట్టాలతో క్యాన్సర్ ముప్పును పసిగట్టవచ్చని చెబుతున్నారు.
స్కాట్లాండ్కు చెందిన స్టార్చ్క్లైడ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు బంగారంతో తయారు చేసిన అతిసూక్ష్మ గొట్టాల సాయంతో క్యాన్సర్ ముప్పును పసిగట్టవచ్చని చెబుతున్నారు. అంతేకాదు, క్యాన్సర్ వ్యాధికి సంబంధించి చేసే చికిత్సలు ఆ వ్యాధిపై సమర్ధవంతంగా పనిచేస్తున్నాయో లేదో కూడా తెలుసుకోవచ్చని చెబుతున్నారు. ప్రెట్ మైక్రోస్కోపీ సాయంతో బంగారంతో తయారు చేసిన నానోట్యూబ్స్ ద్వారా క్యాన్సర్ కణాలను నిశితంగా పరిశీలించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.