: విషాదంలో ఆసీస్ మాజీ కోచ్
ఆస్ట్రేలియా జట్టుకు చాంపియన్స్ ట్రోఫీ వరకు కోచ్ గా వ్యవహరించిన మికీ ఆర్థర్ ను విషాదం చుట్టుముట్టింది. టోర్నీలో కంగారూల పేలవ ప్రదర్శనకు గాను వేటు ఎదుర్కొన్న ఆర్థర్, మరోపక్క తల్లిని కోల్పోయారు. దక్షిణాఫ్రికాలో ఉన్న ఆర్దర్ తల్లి లిన్నే కొంతకాలంగా కేన్సర్ తో పోరాడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమె నిన్న తుదిశ్వాస విడిచారు. మెల్ బోర్న్ నుంచి స్వదేశానికి వస్తుండగా దుబాయ్ వద్ద ఉన్నప్పుడు ఆర్థర్ కు తల్లి మరణవార్త చేరింది. దీంతో, విషాదంలో మునిగిపోయాడు. కాగా, ఈ మాజీ కోచ్ కు ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్, కొత్త కోచ్ డారెన్ లీమన్, క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్లాండ్ ప్రగాఢ సంతాపం తెలిపారు.