: టీట్వంటీలో ఓడిన ఇంగ్లాండ్
న్యూజిలాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరిగిన టీట్వంటీ మ్యాచ్ లో ఆతిధ్య జట్టును పర్యాటక జట్టు ఓడించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు దీంతో న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లు ముగిసే సరికి 201 పరుగులు చేసింది. రూధర్ ఫోర్డ్ 62 పరుగులు చేయగా, బ్రెండన్ మెక్ కల్లమ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. టేలర్ 32 పరుగులు, లాథమ్ 22 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. అనంతరం 202 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 196 పరుగులు మాత్రమే చేయగలిగింది. రైట్ 52, హేల్స్ 39, బొపారా 30, లంబ్ 29 పరుగులతో రాణించినా విజయానికి అవసరమైన పరుగులు చేయలేకపోయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రూధర్ ఫోర్డుకు దక్కింది. ఈ సిరీస్ లో తొలి విజయం సాధించిన కివీస్ ఆధిక్యం సాధించింది.