: ఫిబ్రవరి 4,5 తేదీల్లో సమైక్య ర్యాలీలు
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా నెల్లూరులో భారీ బహిరంగ ర్యాలీలకు సమైక్యాంధ్ర ఐకాస సిద్ధమైంది. నెల్లూరులో అఖిల పక్ష పార్టీలు, మేధావులు, కళాకారులతో ఇవాళ జరిగిన సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన నెల్లూరులోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ నిర్వహిస్తారు. మర్నాడు 5వ తేదీన నెల్లూరులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించాలని ఐకాస నేతలు నిర్ణయించారు.