: వాళ్ళు నిజమైన హీరోలు: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ


ఉత్తరాఖండ్ వరదబాధితులను ఆదుకునే క్రమంలో అసువులుబాసిన భారతీయ వాయుసేన అధికారులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఎయిర్ ఛీఫ్ మార్షల్ ఎన్ఏకే బ్రౌనీకి ఈమేరకు ప్రణబ్ ఓ సందేశాన్ని పంపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అధికారులు నిజమైన హీరోలని ఆయన కీర్తించారు. ఈ సందర్భంగా హిమాలయ సానువుల్లో భారత సైన్యం చేస్తున్న కృషిని ప్రశంసించారు.

  • Loading...

More Telugu News