: డెహ్రడూన్‌లో రాష్ట్ర నేతల డిష్యుం డిష్యుం!
వరద బాధితులను రక్షించడానికని వెళ్లిన రాష్ట్ర నేతలు డెహ్రడూన్‌లో పరస్పరం కొట్టుకున్నారు. రాష్ట్ర పరువును గంగలో కలిపారు. తెలుగువారిని స్వస్థలాలకు తరిలించేందుకు ప్రభుత్వ విమానంతోపాటు తెలుగుదేశం పార్టీ కూడా ఓ విమానాన్ని ఏర్పాటుచేసింది. అయితే తెలుగుదేశం ఏర్పాటు చేసిన విమానం ఎక్కుతున్న బాధితులను కాంగ్రెస్ పార్టీవాళ్లు అడ్డుకొని, ప్రభుత్వ విమానం ఎందుకు ఎక్కించారని తెదేపా సభ్యులు అడగడంతో వివాదం మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, తెలుగుదేశం నాయకుడు రమేష్ రాథోడ్ ఈ ఘటనలో ఒకర్నొకరు తోసుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు.