: వాస్తవాల కోసం సల్మాన్ కొత్త సైట్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 2002లో చేసిన ఏక్సిడెంట్ కేసుపై విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇటీవల కోర్టు వెలిబుచ్చిన అభిప్రాయాలపై మీడియాలో కొన్ని వార్తలొచ్చాయి. అయితే కోర్టు అభిప్రాయాలను మీడియా వక్రీకరిస్తోందని సల్మాన్ ఖాన్ భావించాడు. అందుకే తానే స్వయంగా ప్రజలకు ఈ కేసు గురించి నిజనిజాలు వెల్లడి చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే www.salmankhanfiles.com అనే వెబ్ సైటును ప్రారంభిస్తున్నాడు.