: నేను రెడ్డినైతే బాగుండేది: శంకర్రావు ఆవేదన
తాను రెడ్డిని కాదు కాబట్టే కేసులు పెడుతూ, తనపై వేధింపులకు పాల్పడుతున్నారని మాజీమంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. శంకర్రావు బదులు శంకరరెడ్డిని అయివుంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితులను పరామర్శించే విషయంలో సీఎం కిరణ్ వెనకబడిపోయారని విమర్శించారు. విపక్షనాయకుడు చంద్రబాబు కంటే సీఎం కిరణ్ ఎందుకు ముందుగా బాధితుల వద్దకు వెళ్ళలేకపోయారని శంకర్రావు ప్రశ్నించారు. ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని తొలగించడం సరికాదని ఆయన ప్రభుత్వ వర్గాలకు హితవు పలికారు.