: నోటికి నల్లగుడ్డ కట్టుకున్న శంకరరావు
ఎప్పుడూ గలగలా మాట్లాడే మాజీ మంత్రి శంకర్రావు నోటికి నల్లగుడ్డతో దర్శనమిచ్చారు. తన, పర బేధం లేకుండా ప్రత్యర్థులు, సహచరులపై విరుచుకుపడే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సీఎం, డీజీపీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పోలీసుల నోటీసులకు సమాధానమిచ్చేందుకు హైదరాబాదు, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. అయితే ఎప్పుడూ ఎవరో ఒకర్ని నిందించే శంకర్రావు ఈసారి సమాధానం చెప్పేందుకు నోటికి నల్లగుడ్డ కట్టుకుని పోలీసు స్టేషన్ కు వచ్చి తన ప్రత్యేకత చాటుకున్నారు. ఆయనతో పాటు కుమార్తె సుస్మిత కూడా ఉన్నారు.