: ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు
ఉత్తరాఖండ్ ను మళ్లీ భారీ వర్షాలు చుట్టుముట్టాయి. దీంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయమేర్పడింది. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న యాత్రీకులు మరింత ఇబ్బందుల పాలౌతున్నారు. ఈ వర్షాలు మరో రెండు రోజులపాటు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్ లో కురుస్తున్న వర్షాల కారణంగా దట్టమైన పొగమంచు అలముకుంది. దీని కారణంగా హెలీకాప్టర్ల రాకపోకలు సాగించే వీలు లేకుండా పోయింది.