: కాంగ్రెస్ మద్దతుతో రాజ్యసభకు కనిమొళి
శ్రీలంక అంశంపై కాంగ్రెస్ తో విభేదించి యూపీఏ సర్కారుకు మద్దతు ఉపసంహరించిన డీఎంకేకు ఇప్పుడు కాంగ్రెస్ మద్దతే అవసరమైంది. డీఎంకే అధినేత కరుణానిధి గారాలపట్టి కనిమొళి రాజ్యసభ సభ్యత్వం ముగిసిపోతోంది. తమిళనాడు నుంచి వచ్చేనెలలో మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటిలో ఐదు అధికార ఏఐడీఎంకే ఖాతాలోకే వెళతాయి. మరి కనిమొళిని సొంతంగా రాజ్యసభకు పంపించేంత బలం డీఎంకేకు లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కనిమొళికి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. దీంతో కనిమొళి రాజ్యసభకు.. డీఎంకే, కాంగ్రెస్ ఒకే గూటికి అన్నట్లుగా శుభం కార్డు పడనుంది.