: రాష్ట్రపతి చేతుల మీదుగా ఇలాభట్ కు 'ఇందిరాగాంధీ శాంతి బహుమతి'


ప్రతి ఏడాది ఇచ్చే 'ఇందిరాగాంధీ శాంతి బహుమతి' ని 2011 సంవత్సరానికి గానూ ప్రముఖ సంఘ సేవకురాలు ఇలా రమేశ్ భట్ కు ప్రదానం చేశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డును ఆమె అందుకున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు పలువురు హాజరయ్యారు. మహిళల స్వావలంబనకు తోడ్పడే 'సెల్ఫ్ ఎంప్లాయిడ్ విమెన్స్ అసోసియేషన్' (సేవ) అనే స్వచ్ఛంధ సంస్థను నెలకొల్పి మహిళలకు ధైర్యాన్ని ఇస్తూ, వారికి ఇలాభట్ ఉపాధి కల్పిస్తున్నారు.

  • Loading...

More Telugu News