: 430 మంది తెలుగువారు మరణించినట్లేనా?
ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లిన తెలుగువారిలో 430 మంది ఆచూకీ లభించడం లేదని సహాయ పునరావాస కమిషనర్ రాధ తెలిపారు. మొత్తం 2,616 మంది వెళ్లగా 1,239 మంది తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారని, మరో 933 మంది క్షేమంగా ఉన్నట్లు సమాచారం ఉందని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే మిగిలిన వారు గల్లంతై ఉంటారని ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు బదరీనాథ్ వద్ద 350 మంది తెలుగు వారు నిలిచిపోయారు. వీరంతా సాయం కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.