: లంగర్ హౌజ్ లో ఆక్రమణల కూల్చివేత
హైదరాబాద్ లోని లంగర్ హౌజ్ చెరువుకట్ట చుట్టూ వెలసిన ఆక్రమణల తొలగింపును రెవెన్యూ అధికారులు చేపట్టారు. భారీ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. చెరువు చుట్టూ గత కొంత కాలంగా భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వాటిని తొలగించాలంటూ అధికారులు నోటీసులు జారీ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ప్రత్యక్ష కార్యచరణకు దిగారు. కూల్చివేతలను ఆపివేయాలని కార్వాన్ ఎమ్మెల్యే అఫ్సర్ ఖాన్ డిమాండ్ చేశారు.