: ఎదురీదండి... విజయం వరిస్తుంది: సీబీఐ మాజీ జ


ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఎదురీదినప్పుడే విజయం వరిస్తుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెంలోని బీవీ అండ్ బీఎన్ జూనియర్ కళాశాలలో గ్రూప్ 2 పరీక్షలకు శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి వారిలో స్ఫూర్తి నింపారు. జీవితంలో క్రమశిక్షణ అలవడితే సాధించలేనిది ఏమీ లేదని ఆయన అన్నారు. యువత సినిమాల ప్రభావానికి లోను కాకుండా ఉండాలని, సన్మార్గంలో వెళితే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. కుటుంబాన్ని గుర్తు తెచ్చుకుని మనం ఎందుకు చదువుతున్నామో, మన లక్ష్యం ఏంటో ప్రతిక్షణం గుర్తించుకుంటే విజయానికి సగం దగ్గరగా వచ్చినట్టేనని, పట్టుదలగా చదవాలని లక్ష్మీనారాయణ సూచించారు.

  • Loading...

More Telugu News