: పొన్నాల ఎన్నిక చట్టబద్దమా?.. కాదా?.. తీర్పు రిజర్వులో
మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎన్నిక చట్టబద్దమా?.. కాదా? అనే వివాదంపై నేటితో హైకోర్టులో వాదనలు ముగిశాయి. అయితే దీనిపై తీర్పును న్యాయస్థానం రిజర్వులో ఉంచింది. 2009 ఎన్నికల్లో పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, పొన్నాల ఎన్నికను రద్దు చేయాలని ఆరోపిస్తూ ఆయన ప్రత్యర్ధి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపులా సుదీర్ఘవాదనలు విన్న న్యాయమూర్తులు తీర్పును రిజర్వులో ఉంచారు.