: నేను మండేలా అభిమానిని: అమితాబ్
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు తాను అభిమానినని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. 94 ఏళ్లున్న మండేలా ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. 'నేను రెండుసార్లు దక్షిణాఫ్రికాలో ఆయన్ను కలుసుకున్నాను. గొప్ప వ్యక్తి. నేను ఆయన అభిమానిని' అంటూ వెల్లడించారు అమితాబ్.