: అనిల్ కు కేటాయించిన భూములను పేదలకు పంచుతాం: నారాయణ
బ్రదర్ అనిల్ కు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఎర్ర జెండాలు పాతి, పేదలకు పంచుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. తాము అలా చేయకుండా ఉండాలంటే ప్రభుత్వమే ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు.
రెండ్రోజుల క్రితం బ్రదర్ అనిల్ పై హైదరాబాద్ శివారు ప్రాంతమైన మణికొండలోనూ భూకబ్జాకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. తిరుపతిలో జరిగిన చిత్తూరు సీపీఐ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న నారాయణ విలేకరులతో మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం ఇకనైనా సజావుగా నిర్వహించాలని కోరారు.