: కడప సహకార ఫలితాల్లో అయోమయం!
కడప సహకార ఎన్నికల్లో కాంగ్రెస్, వైఎస్సార్సీపీ ఎవరికి వారు తామే గెలిచినట్టు ప్రకటించుకోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తొలుత కడప డీసీసీబీ చైర్మన్ పదవి తమనే వరించినట్టు ఎమ్మెల్యే వీరశివారెడ్డి అనుచరులు ఆనందంతో గంతులేశారు.
అయితే, లెక్కింపు పూర్తికాకుండా చైర్మన్ పదవి ఎలా ప్రకటిస్తారని వైఎస్సార్ పార్టీ నేతలు అధికారులను ప్రశ్నించారు. కొద్ది సేపటి తర్వాత మిగతా రెండు స్థానాలు తామే గెలిచామంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. దీంతో, సరైన ఫలితాలు ప్రకటించి గందరగోళానికి తెరదించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.