: పట్టాలెక్కిన రెండు కొత్త రైళ్లు
రాష్ట్రవాసులకు రెండు కొత్త రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. సికింద్రాబాద్-కర్నూలు మధ్య ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్, కర్నూలు-నంద్యాల మధ్య ప్యాసింజర్ రైళ్లను కర్నూలులో రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కర్నూలు, సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ప్రతి రోజూ ఉదయం 6.30గంటలకు కర్నూలులో బయల్దేరి 10.30గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 5.30గంటలకు సికింద్రాబాద్ లో బయల్దేరి రాత్రి 9.30గంటలకు కర్నూలు పట్టణం చేరుకుంటుంది.