: 15 అంతస్తుల ఎత్తులో పెద్ద సాహసం


పదడుగుల ఎత్తులో గోడపై నడవాలంటేనే గజగజ వణుకుతాం. కానీ, ఓ సాహసికుడు 1500 అడుగుల ఎత్తులో నడిచి చూపించాడు. అదీ, ఎక్కడనుకుంటున్నారు... రెండు పర్వతాల నడుమ! ఒకవేళ పట్టు తప్పితే పరలోకానికే. మరి సాహసికులకు అలాంటి భయంకర విన్యాసాలే ఇష్టం మరి!

అమెరికాకు చెందిన నిక్(34) తూర్పు అరిజోనా రాష్ట్రం, గ్రాండ్ కెన్యాన్ సమీపంలో ఉన్న పర్వతాలను తన సాహసానికి వేదికగా చేసుకున్నాడు. 1500 అడుగుల ఎత్తులో రెండు పర్వతాల నడుమ రెండంగుళాల స్టీల్ తాడు ఏర్పాటు చేసుకున్నాడు. బ్యాలెన్స్ కోసం కర్ర సాయంతో అటు నుంచి ఇటు తాపీగా నడిచేశాడు. 23 నిమిషాల్లో సాహసం పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.

  • Loading...

More Telugu News